పాలుపంచుకోండి
ప్రాజెక్ట్ బృందమే కాక, ఎవరైనా కాంప్ మ్యూజిక్ ప్రాజెక్ట్ లో పాల్గొని, లక్ష్య సాధనలో బాగం కావొచ్చు.
ఈ పరిశోధనలో కీలకమైన సంగీత సంప్రదాయాల గురించిన మంచి సమాచార వనరులు కాంప్ మ్యూజిక్ కి చాలా సహాయ పడగలవు. అటువంటి వనరులు క్రియేటివ్ కామన్స్ వంటి ఓపెన్ లైసెన్స్ తో లభ్యమైతే మరింత మంచిది. శోధించడానికి వీలున్న ఎటువంటి వనరుల్లోనైనా సరే, మీరు ఉపయోగపడే సమాచారం చేర్చగలిగితే అదే గొప్ప సహాయం అవుతుంది! అదే కాక, ప్రాజెక్ట్ లక్ష్యాలపై మీ విమర్శనాత్మక సలహాలు, సూచనలు సదా అభినందనీయం.
కాంప్ మ్యూజిక్ లో పాలుపంచుకోవడానికి కొన్ని ఆలోచనలు:
- ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ గురించిన సమాచారం అందుకోవడం కోసం వార్తలు, బ్లాగు ఆర్.ఎస్.ఎస్. ఫీడులకి సబ్స్క్రైబ్ అవ్వండి.
- కాంప్ మ్యూజిక్-ఫ్రెండ్స్ మెయిలింగ్ లిస్టుకి సబ్స్క్రైబ్ అయ్యి, మీ ఆలోచనలు, పరిశోధన ఫలితాలు, సందేహాలు, సమాచార వనరులు వగైరా వంటివి పంచుకోండి.
-
సమాచారం పెంపొందించడంలో బాగం అవ్వండి.
- వికీపీడియాలో సాధ్యమైనన్ని భాషల్లో సంగీతాన్ని గురించి వివరంగా రాయడం (హిందూస్థానీ, కర్ణాటక, ఒట్టోమాన్, అండలూసియాన్, మరియు హన్ సంగీతాల గురించి మొదలుపెట్టొచ్చు).
- ఆయా సంగీతాల్లో వినిపించే రకరకాల శబ్దాల్ని రికార్డ్ చేసి ఫ్రీసౌండ్ సైట్లో పెట్టడం.
- మీ దగ్గర ఉన్న పూర్తి రికార్డింగులు, ఒకవేళ ఎటువంటి కాపీరైట్ సమస్యలు లేకపోతే, ఇంటర్నెట్ ఆర్కైవ్, జామెందో లాంటి సైట్లలో పెట్టడం.
- మెండెలె ఉపకరణంలో ఇక్కడ పరిశోదిస్తున్న సంగీతాల గురించిన పబ్లికేషన్స్ ఆయ గ్రూపులలో (కాంప్ మ్యూజిక్-జనరల్, మకం మ్యూజిక్, ఇండియన్ మ్యూజిక్) కలపడం.
- మ్యూజిక్-బ్రైన్స్ లో ఆయా సంగీతాలలో ఉన్న సీడీలను చేర్చడం.
- ఉపయోగపడుతుంది అనిపించే ఏ ఇతర మర్గాలలోనైనా సరే.. (ఉదా: వికీపీడియాలో సంగీత సంగణన మీద వ్యాసాలు రాయడం, ఉన్న వాటిని పునరుద్దరించడం.)