ముఖ పత్రం

కాంప్ మ్యూజిక్, యూరోపియన్ రీసెర్చ్ కౌన్సిల్ వారి నిధులతో చవియర్ సెర్రా (మ్యూజిక్ టెక్నాలజీ గ్రూప్, పాంపేవ్ ఫాబ్రా విశ్వవిద్యాలయం, బార్సిలోనా, స్పెయిన్) ఆద్వర్యంలో నడుస్తున్న ప్రాజెక్ట్. ప్రపంచ సంగీత సంగణనలో సమకాలీన పరిశోధక అంశాల్ని, ఆయా సంస్కృతుల అవగాహనతో పరిశోధించి ముందుకు సాగడమే కాంప్ మ్యూజిక్ ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ లో ముఖ్యంగా కర్ణాటక (దక్షిణ భారతం), హిందుస్థానీ (ఉత్తర భారతం), టర్కిష్-మకాం(టర్కీ), అరబ్-అండలూసియన్ (మఘ్రెబ్ ప్రాంతం) మరియు బీజింగ్ ఒపెరా (చైనా)మొదలగు సంప్రదాయాలపై పరిశోధన జరుగుతుంది.


dunya.compmusic.upf.edu

ఇక్కడ జరిగే పరిశోధన ఫలితాలు అందరికీ అందుబాటులో ఉంచి ఆ ఫలితాల విశ్లేషణకి ఉపయోగపడటం కోసం దునియా అనే నమూనా అప్లికేషన్ ని తయారు చేశాము. ఇది ఇంకా అభివృద్దిలోనే ఉందని గమనించగలరు.